About Me

My photo
Juvvalapalem, Andhra Pradesh, India
ఇది జంపన వారి కళా తృష్ణకి నిలువెత్తు నిదర్శనం. తెరలు తెరలుగా పైకెగసే భక్తి భావానికి సంపుటి రూపం మా ఈ ప్రయత్నం. గౌరవనీయులు శ్రీయుతులు జంపన సత్యనారాయణ రాజు గారు మరియు వారి సహధర్మచారిణి అయినటువంటి శ్రీ వరలక్ష్మి గార్ల స్వహస్తాలతో పొందుపరచబడిన రాగాల మాలిక. వారి ఇంట వెలసిన దేవతా మూర్తుల గానామృత చరిత్రకి మంచి మనసులు తోడై రచించిన కరపత్ర దీపిక.

భజన గీతాలు


శ్రీరస్తు                   శుభమస్తు           అవిఘ్నమస్తు                ఓం నమో విఘ్నేశ్వరాయ నమః
మాల్కోస్ రాగం :: ఆది  తాళం                                       శ్రీ గణపతి పాట
పల్లవి -            శ్రీ గణేశ్వర, గిరిజా కుమారా..
సుగుణ సంపన్న, సాకారా...
మంచి కుడుములు, ఉండ్రాళ్ళు నీ ..కు ..
ఉంచి నానయ్య , రా ..వే.. రా..                               ||శ్రీ గణేశ్వర||

 చరణం :-1    పూర్వము నీ పుణ్య ఫలమేమొగాని
పార్వతి ప్రియ పుత్రుడైనావు జ్ఞాని
పర్వత సంచారా.., సర్వము నీవేరా..
ప్రార్ధన చేసేమురా ...  ...                            ||శ్రీ గణేశ్వర||

చరణం :-2     పని నే జేసినను నిన్ను ముందు
నీ పద పద్మాలు స్మరియించు చుందు
తాపస మందార.., తండ్రివి నీవేరా..
తనయుని కాపాడరా ...  ...                        ||శ్రీ గణేశ్వర||

చరణం :-3     శ్రీకర శ్రీకృష్ణ భగవానుడై..నా..
నిందలు మోసేడు నీ కారణా..నా..
నీ కృప లేకున్న.., ధర ఎవరైనా..
కార్యములను జేయునా ...  ...                   ||శ్రీ గణేశ్వర||

చరణం :- 4    ఏలిక నీ వాహనం ఎలుక రాజా
బాలుడు భక్తుండు నూకరాజూ ..
జాలము నీకేల .., జాలితొ రావేరా..
మాలను గై కొనరా ... ...                           ||శ్రీ గణేశ్వర||

మోహన  రాగం :: ఆది తాళం                               శ్రీ ఆంజనేయుని పాట


పల్లవి - నమో ఆంజనేయా, జయ జయ నమో రామదూతా...
ప్రభో , నమో ఆంజనేయా, జయ జయ నమో రామదూతా...
జయ జయ నమో రామదూతా...                         ||నమోఆంజనేయా||
                                               
 చరణం :-1       రామ రామ యని రయమున పాడుచు
రామ స్మరణము, చేసెడి వారికి
రామ లక్ష్మణుల, భారము నాదని
పేరు ప్రఖ్యాతులు, గాంచిన దేవా ...                                  ||నమోఆంజనేయా||

చరణం :-2        పండ్లు ఫలంబులు పనస తొనలను
సీతా రాముల, భుజియింపగను
కన్నబిడ్డ వలె, కనికరించుచు
కన్నుల పండుగ , గాంచిన దేవా ...                                  ||నమోఆంజనేయా||

చరణం :-3        భక్తుల నెల్లను , బ్రోచే వాడా
ముక్తి సంపదల, నొసగే వాడా
ఆంజనేయుడవు, నీవే కావా
రామ భక్తా, శ్రీ ఆంజనేయా ...                           ||నమోఆంజనేయా||

చరణం :- 4       రామ లక్ష్మణుల , నిరతము గాంచిన
వానర మూర్తివి , నీవే కావా
ఎల్లప్పుడు , నీ నామమె గతియని
స్మరించి , భజించి , తరింతు దేవా ...                     ||నమోఆంజనేయా||
శ్రీ పార్వతి దేవి పాట
పల్లవి :–

అంబ పరమేశ్వరి అఖిలాం డేశ్వరి
ఆది పరా శక్తి పాలయ మాం

త్రి భువనేశ్వరి రాజ రాజేశ్వరి 
ఆనంద రూపిణి పాలయమాం 
పరమానంద  రూపిణి పాలయమాం 
బ్రహ్మా నంద రూపిణి పాలయమాం                                  || అంబ ||


శంభో మహ దేవ శంకర శివ శివ
హర హర మహ దేవ శంకర శివ శివ
ఓం నమః శ్శివాయ , ఓం నమః శ్శివాయ
ఓం నమః శ్శివాయ , ఓం నమః శ్శివాయ
మోహన రాగం  :: ఆది తాళం                                          శ్రీ శివుని పాట


పల్లవి
ఓ, ఓ ఓ ఓ ఓ కైలాస హిమగిరి శంకరా... ,
అను పల్లవి :--
                      కనికరా.. ముంచరా...
కరుణించి మోము చూపించరా..                            ||  ||
 చరణం :-1 
చంద్ర మౌళీ, శ్రిత పద్మ శాలి
చంద్ర కిరణాల , తేజో  (ప్రభో )విహారి
దండ మోయీ, లింగ ధారి
శరణు శరణూ శరణంటి నిన్నే                         || కనికరా.. ||
చరణం :-2
గంగనూ శిరమూ, దాల్చె దేవర
ముందుగా నన్ను, బ్రోవగ రాదా
అందమైన , శంభు   లింగా
శరణు శరణూ శరణంటి నిన్నే                         || కనికరా.. ||
చరణం :-3
నీల కంఠా, శేషా భూషణ
ఆశ్రిత భక్తుల, బ్రోచే వాడా
భక్త సులభుడ, నను బ్రోవ వేగా
శరణు శరణూ శరణంటి నిన్నే                         || కనికరా.. ||

కోడి ఒక కోనలో వరస :: తిశ్ర గతి  తాళం              శ్రీ శివుని పాట





పల్లవి
నిన్నె వేడు కొంటినీ, నన్ను కావ మంటినీ
పరమాత్మ పాహి శంభో దాసిని శరణంటినీ               || నిన్నె వేడు ||

చరణం :-1 
కాశి పుర దేవ రావ కైలాస వాసా ..ఆ ఆ ఆ ఆ
కరు ణాల వాల రావ, కాఠిన్య మేల దేవ
పార్వతి నాధ , పలుకగ రావా
పరమేశా నాయందు,  కరుణ కలిగి యుండరా ,
 ( కరుణ  క లి గి  యుం డ రా .. )          || నిన్నె వేడు ||

చరణం :-2
మాయ దారి జగతి లో మునిగి పోయి యంటి నీ .. యీ యీ యీ యీ
ముక్తి దారి చెప్పమని,  బ్రతిమ లాడు చుంటినీ
గణపతి తండ్రీ .. గౌరీ రమణా ..
దయ తలచీ ( లక్ష్మికీ దర్శనమే ఈయరా
 ( దర్శనమే ఈ ..య రా.. )          || నిన్నె వేడు ||




------------- రాగం  :: ఆది తాళం                              శ్రీ శివుని పాట


పల్లవి :–
దేవ దేవ ధవళాచల మందిర
గంగాధర హర నమో నమో
దైవతలోక , సుధాకర హిమకర
లోక శుభంకర , నమో నమో                                 ||దేవ దేవ ||
 చరణం :-1 
పాలిత కింకర , భవనా శంకర 
శంకర పుర హర నమో నమో
హాలా హాల ధర , శులాయుగ  కర
శైల  సుతా వర , నమో నమో                              ||దేవ దేవ ||
చరణం :-2
దురిత విలోచన , పాల విలోచన
పరమ దయాకర , నమో నమో
కరి చర్మాంభర, చంద్ర కళా ధర
సాంబ దిగంబరనమో నమో                              ||దేవ దేవ ||

------------- రాగం  :: ఆది తాళం                                   శ్రీ శివుని పాట




పల్లవి :–
మహేశా పాప వినాశా , కైలాస వాసా ఈశా
నిన్ను నమ్మి నా ను రావ, నీల కంధరా                             || మహేశా ||
 చరణం :-1 
భక్తి యే దొ పూజ లేవో , తెలియ నైతినే
పాపమేదో పుణ్యమేదో , కాననైతినే దేవా                            || మహేశా ||
             
చరణం :-2
మంత్ర యుక్త పూజ చేయ.. , మనసు కరుగునా ....
మంత్రమో.. తంత్రమో.. , యెరుగ నైతినే ....
నాద మేదొ వేద మేదో, తెలియనైతినే ..
వాదమేల పేద బాధా... , తీర్చ రావయా .. స్వామీ...            || మహేశా ||
చరణం :-3
ఏక చిత్తమున నమ్మిన వారికి
శోకము తీర్తువో రుద్రయ్యా
ప్రాకటముగ, చిరు వేట జూపి -
- నా ఆకలి దీర్చగ రావయ్యా

ధీటుగ నమ్మితి గనవయ్యా
వేట జూపుమా రుద్రయ్యా

------------- రాగం  :: ఆది తాళం                                 శ్రీ శివ కేశవుల పాట
               


పల్లవి :–
శివ కేశవులకు, బేధమా
సుజ్ఞాన వంతులకు భారమా                                           || శివ కేశవు ||

 చరణం :-1 
ప్రేమ బూడిద రాసె లింగడూ
పట్టూ నామాల్ పెట్టే రంగడూ
ప్రేమ బూడిద లింగ, పట్టూ నామాల్ రంగ
వారిద్దరొకటేను, వాదాపు జనులార                                  || శివ కేశవు ||
             
             
చరణం :-2
పులి చర్మం కట్టే లింగడూ
పట్టూ నామాల్ పెట్టే రంగడూ
పులీ చర్మం లింగ ,పట్టూ నామాల్ రంగ
వారిద్దరొకటేను, వాదాపు జనులార                                  || శివ కేశవు ||

చరణం :-3
ఎద్దు నెక్కిన వాడు.. లింగడు
గద్ద నెక్కిన వాడు రంగడు
ఎద్దు నెక్కిన లింగ, గద్ద నెక్కిన రంగ
వారిద్దరొకటేను, వాదాపు జనులార                                  || శివ కేశవు ||


చరణం :-4      
ఘంట శంఖము పట్టె లింగడు
శంఖు, చక్రము పట్టె రంగడు
ఘంట శంఖము లింగ ,శంఖు చక్రము రంగ
వారిద్దరొకటేను, వాదాపు జనులార                                  || శివ కేశవు || 


చరణం :-5
పాము పాగా చుట్టే లింగడు
పాము ఫై పవ్వ ళించే రంగడు
పాము పాగ లింగ, పవ్వ ళించే రంగ
వారిద్దరొకటేను, వాదాపు జనులార                                  || శివ కేశవు ||

చరణం :-6
కైలాస గిరి యందు లింగడు
వైకుంఠ పురమందు రంగడు
కైలాస గిరి లింగ, వైకుంఠ పుర రంగ 
వారిద్దరొకటేను, వాదాపు జనులార                                  || శివ కేశవు ||


నవ్వవే నా చెలీ వరస   :: ఆది తాళం                        శ్రీ రాముని పాట


పల్లవి
రాముడే దేవుడూ, దేవుడే రాముడూ
నీల మేఘ శ్యాముడు, నిజముగ యున్నాడు 
భక్తుల బ్రోచేటి దొర యాతడే...                             
||రాముడే దేవుడూ||        
 చరణం :-1 
జగమేలు దేవుండు , శ్రీ రాముడూ ..
జయమొసగి, కాపాడు రాముడూ ..
నమ్మి సేవించెదా, ముక్తి చూపించరా..
ధరలో నను, బ్రోచె దొర యాతడే...                    ||రాముడే దేవుడూ||

చరణం :-2
నాడు వేడేను, హనుమంతుడు
రామా రామా యని , తరియించెను
రామ దాసైనను, భక్త శబరైనను
అందరిని బ్రోచేటి దొర యాతడే ...                          ||రాముడే దేవుడూ||

చరణం :-3
ఎన్నెన్ని కష్టాలు , ఎదురై ననూ..
భరియించ లేనంత, బాధైనను..
భారమే నీవనీ, దిక్కు మాకెవరనీ ..
పిలచిన పలికేటి దొర యాతడే ...                           ||రాముడే దేవుడూ||

హంస ధ్వని రాగం  :: ఆది తాళం                                శ్రీ రాముని పాట




పల్లవి
శ్రీ రఘు రామ్, జయ రఘు రామ్
సీతా మనోభి రామ్ .... జయ జయ              || శ్రీ రఘు రామ్ ||
  
 చరణం :-1 
అన్నదమ్ములా ఆదర్శమైనా
ఆలూ మగలా అన్యోన్యమైనా
తండ్రి మాట నూ, నిలుపుట కైనా
ధరలో  మీరే దశరధ రామ్                      || శ్రీ రఘు రామ్ ||

చరణం :-2
వెలయు నే ఎడ, నీ దివ్య మూర్తీ
వెలిగే మాయెడఆనంద జ్యోతీ
వెలసి మా గృహం, శాంతి నివాసం
సలుపవె శుభగుణ, శోభిత రామ్                || శ్రీ రఘు రామ్ ||

చరణం :-3
శ్రీ రామ చంద్రః, శ్రిత పారి జాతః
సమస్త కళ్యాణ గుణాభి రామ
సీతా ముఖాంబోరు హచం చరీక
నిరంతర మంగళ మాత నోతూ                   || శ్రీ రఘు రామ్ ||

శ్రీ రామ జయ రామ పాట                             శ్రీ రాముని పాట




 పల్లవి :–
శ్రీ రామ జయ రామ జయ జయ రామ
రామ రామ ఓం కార రామ                                     
|| శ్రీ రామ ||

చరణం :-1 

చారు సుందర రామ జానకి రామ
పాలించరా తండ్రి పావన రామ                                                                           || శ్రీ రామ ||
చరణం :-2

కోరితి రా నిన్నే కోదండ రామ
దయ చూడరా మమ్ము దశరధ రామ                                          || శ్రీ రామ ||
చరణం :-3

కరుణించు మమ్మేలు కళ్యాణ రామ
అడిగితి రా నిన్నే అయోధ్య రామ                              
|| శ్రీ రామ ||

మధ్య మావతి రాగం :: ఆది తాళం                           శ్రీ రాముని పాట

పల్లవి
సీతా రాముల కళ్యాణము చూతము రారండీ
శ్రీ సీతా రాముల కళ్యాణము చూతము రారండీ      

 చరణం :-1 
చూచు వారలకు, చూడ ముచ్చట
పుణ్య పురుషులకు ధన్య భాగ్య మట
భక్తి యుక్తు లకు , ముక్తి ప్రదమట.. .. .. .. ..

 భక్తి యుక్తు లకు , ముక్తి ప్రదమట
సురులును మునులును , చూడ వచ్చి రట || కళ్యాణము ||
చరణం :-2
దుర్జన కోటి ని , దర్ప మడంచగ
సజ్జన కోటి ని , సంర క్షిం పగ
ధారుణి శాంతిని , స్థాపన చేయగా .. .. .. .. ..

 ధారుణి శాంతిని , స్థాపన చేయగ
నరుడై పుట్టిన , పురుషోత్తముని                      || కళ్యాణము ||

చరణం :-3
దశరధ రాజు , సుతుడై వెలసి
కౌశిక యాగము , రక్షణ జేసి
జనకుని సభలో , హరు విల్లు విరచి .. .. .. .. ..

జనకుని సభలో , హరు విల్లు విరచి
జానకి మనసును గెలచిన రాముని                       || కళ్యాణము ||
చరణం :-4
సిరి కళ్యాణపు , బొట్టును బెట్టి                    
మణి బాసికమును , నుదుటను కట్టి
పారాణి ని పాదాలకు బెట్టి  .. .. .. .. ..

పారాణి ని పాదాలకు బెట్టి 
పెండ్లి కూతురై వెలసిన సీతా                                            || కళ్యాణము ||
చరణం :-5
సంపగ నూనె, కురులకు దువ్వి
సొంపుగ కస్తూరి నామము దీర్చి 
చంప జవాజి చుక్కను బెట్టి  .. .. .. .. ..

 చంప జవాజి చుక్కను బెట్టి  
పెండ్లీ కొడుకై  వెలసిన రాముని                             || కళ్యాణము ||
చరణం :-5
జానకి దోసిట , కెంపుల ప్రోవై
రాముని దోసిట , నీలపు రాలై
ఆణి ముత్యములు , తలంబ్రాలుగా .. .. .. .. ..

ఆణి ముత్యములు , తలంబ్రాలుగా
శిరమున మెరసిన , సీతా రాముల                                   || కళ్యాణము ||

------------------- రాగం  :: ఆది తాళం                             శ్రీరాముని పాట

పల్లవి
జగదభి రామా , రఘుకుల సోమా
అను పల్లవి :-  
శరణము నీయ వయా .... రామా ...
కరుణను జూ .. వయా ....                      || జగదభి రామా || 
 చరణం :-1 
కౌశిక యాగము , కాచితి వయ్యా
రాతిని నాతిగ చేసితి వయ్యా
హరు విల్లు విరచి ,మురిపించి సీతను
పరిణయ మాడిన , కళ్యాణ రామా

శరణము నీయ వయా .... రామా ...
కరుణను జూ .. వయా ....                      || జగదభి రామా || 
చరణం :-2
ఒకటే బాణం , ఒకటే మాట
ఒకటే సతి యని , చాటితి వయ్యా
కు జనుల నణచి , సు జనుల బ్రోచిన
ఆదర్శ మూర్తివి , నీ వే నయ్యా

జయ జయ రామ్ , జానకి రామ్
పావన నామా , మేఘ శ్యామా ....               || జగదభి రామా || 

                                                            శ్రీ రాముని పాట





 పల్లవి :–
భజ మన రాం, భజ మన రాం
పాండు రంగ, శ్రీ రంగ భజ మన రాం                      || భజ మన రాం ||
చరణం :-1 

భజ మన రాఘవ, భజ మన యాదవ
భజ మన కేశవ, భజ మన రాం
|| భజ మన రాం ||
చరణం :-2

భజ మన రఘువర, భజ మన యదువర
భజ మన మురహర, భజ మన రాం
|| భజ మన రాం ||

చరణం :-3

భజ మన ఆనంద, భజ మన గోవింద 
భజ మన ముకుంద, భజ మన రాం  
|| భజ మన రాం ||
------------------ రాగం  :: ఆది తాళం                        శ్రీ రాముని పాట


పల్లవి
అంతా రామ మయం, ఈ జగమంతా రామ మయం
అను పల్లవి :-- 
అంత రంగమున,  ఆత్మా రామం, అనంత రూపముల వింతలు సలుపగ --
// అంత రంగమున,  ఆత్మా రామం, అనంత రూపముల వింతలు సలుపగ //
  || రామ రామ రామ సీతా ||  రామ రామ రామ సీతా ||
 చరణం :-1 
సోమ సూర్యులును, సురలును తారలు
ఆ మహాంబుధులు, అవవి జగంబులు     
|| రామ రామ రామ సీతా || రామ రామ రామ సీతా || 
అ౦డా౦ డ౦బులు, పిండాం డంబులు
బ్రహ్మండంబులు, బ్రహ్మలు మొదలుగ                 ||  అంతా రామ మయం ||
చరణం :-2
నదులు వనంబులు, నానా మృగములు
వివిధ కర్మములు, వేద శాస్త్రములు       
 || రామ రామ రామ సీతా || రామ రామ రామ సీతా || 
అష్ట దిక్కులును, ఆది శేషుడును
అష్ట వసువులు, అరిషడ్ వర్గము                    ||  అంతా రామ మయం ||

చరణం :-3
ధీరుడు భద్రాచల రామ దాసు నీ
కోరికlll లొసగెడి తారక నామము                   ||  అంతా రామ మయం ||

నా మది నిన్ను పిలచింది గానమై వరస :: ఆది తాళం           శ్రీ వేంకటేశ్వరుని పాట





పల్లవి
మురిపాల శ్రీ వెంకటా పతీ
నీవే నా... గతీ , మంగా పతీ                                            || మురిపాల || 

చరణం :-1 
యిమ్మని నీ సొమ్ము , నే నడుగ లేదు
బొమ్మవు నీవంచు, వాదించ లేదు
కమ్మని నీ గానమే , నమ్మినాను
నమ్మక మే లేక  పోయనా                                   || మురిపాల ||

చరణం :-2
వెలుగుల బంగారు , సౌధంబు లోన
నెలకొని యున్నావు , నీలాద్రి పైన
తలపుల నమ్మి హృదయంబు లోన
పిలచిన పలుకా  వేమయా                                             || మురిపాల ||
చరణం :-3
అధముడ నేనంచు , అనుకొన్న గాని
వదలను నిన్నింక,వద్దన్న గాని
తిరుమల గిరి వాస శ్రీనివాస
వరముల కాశింప లేదయా                                   || మురిపాల ||

---------------- రాగం  :: ఆది తాళం                 శ్రీ వేంకటేశ్వరుని పాట

పల్లవి :–
జై జై విమలారుణ చరణా
జై జై కరుణా...  భరణా...

చరణం :-1 
శ్రీ రమణా మహీ రమణా
శ్రీ వేంకటేశా ప్రభో , అలివేలు మంగా విభో             || శ్రీ రమణా ||

మా పూజ లందుము, మమ్మెపుడు బ్రోవుము
నీవే సదా గతి, శోభా కృతీ
పాహిమాం ,పాహిమాం , పాహిమాం                      || జై జై ||

చరణం :-2
కారుణ్య గుణ ,ధామ రామా
భువిజా తాత్మ వాస పరేశ                                    || కారుణ్య ||

శుభ గాత్ర సువిశాల నేత్రా
మానతు లందుమా , మము కరుణించుమా
పాGDFGహిమాం ,పాహిమాం , పాహిమాం                       || జై జై ||





చిట పట చినుకులు పదుతూ ఉంటే వరస :: ఆది తాళం         శ్రీ వేంకటేశ్వరుని పాట

పల్లవి :–
తిరుపతి యాత్రకు వెళుతూ వుంటే
తిరుమల దేవుని స్మరిస్తు వుంటే
ఏడు కొండలు ఒకే సారిగా,
ఆడుతు పాడుతు ఎక్కుతు ఉంటే ...
చెప్ప లేని మా పాపా లన్ని , పరిహర మౌతాయోయి           || తిరుపతి ||

చరణం :-1 
మంగళ రవములు పాడుతు వుంటే..., పాడుతు వుంటే
సుప్రభాతము చదువుతు వుంటే ..., చదువుతు వుంటే
జగతిని మరచి , ప్రభు సన్నిధి లో  
ఆత్మ శుద్ధిగా నిలబడి ఉంటే ...
చెప్ప లేని మా పాపా లన్ని , పరిహర మౌతాయోయి           || తిరుపతి ||

చరణం :-2
శ్రీనివాసయని వేడుతు వుంటే ..., వేడుతు వుంటే
వరము లిమ్మని కోరుతు వుంటే ..., కోరుతు వుంటే
ధగ ధగ మెరిసే చల్లని దేవుడు
ఎదుటను తానై నిలబడి ఉంటే ...
చెప్ప లేని మా పాపా లన్ని , పరిహర మౌతాయోయి           || తిరుపతి ||

____ వరస :: ఆది తాళం        శ్రీ వేంకటేశ్వరుని పాట



పల్లవి :–
తిరుమల మందిర , సుందరా
సుమధుర కరుణా సాగరా
పేరున నిను పిలచేనురా
యే రూపముగా .. , కొలిచేనురా                                       || తిరుమల ||

చరణం :-1 
పాల కడలిలో , శేష శయ్య ఫై
పవళించిన , శ్రీ పతి వో
వెండి కొండ పై నిండు మనసుతో
వెలిగే గౌరీ , పతి వో
ముగురమ్మలకే , మూలపుటమ్మగా
భువిలో వెలసిన ఆది శక్తి వో                                                       || తిరుమల ||

చరణం :-2
కాంతులు చిందే , నీ ముఖ బింబము
కాంచిన చాలును ఘడియైనా
నీ గుడి వాకిట , దివ్వెను నేనై
వెలిగిన చాలును , రేయైనా
నీ పదములపై కుసుమము నేనై
నిలచిన చాలును క్షణమైనా                                                        || తిరుమల ||

హిందూ స్తాన్ రాగము :: ఆది తాళము                శ్రీ కృష్ణుని పాట

పల్లవి :–
రాధా మోహన రాస విహారీ
యదుకుల పూజిత వనమాలీ
అను పల్లవి :--
గోపాలా జయ గోపాలా                                         || రాధా మోహన ||

చరణం :-1 
మురళీ లోల మునిజన పాలా
సురగుణ శోభిత గిరి ధారీ
సురగుణ శోభిత గిరి ధారీ                                     || గోపాలా||

చరణం :-2
మధురం మధురం మాధవ స్మరణం
ఆత్మ శాంతి కది మూల ధనం
సనక సనందన , ముని జన వందిత 
నంద కుమారే , దైవము రా                                            || గోపాలా||

చరణం :-3
శ్యామ సుందరుని , కోమల రూపుని
యమున విహారుని , కొలువుమురా
హరి యేరా , శ్రీ హరి యేరా
హరి పద స్మరమే, చరితార్ధమురా                         || గోపాలా||


సుంద రాంగా మరువగ లేనోయ్ వరస :: ఆది తాళం         శ్రీ కృష్ణుని పాట






పల్లవి :–
మోహనాంగా ముద్దుల కృష్ణా రావేరా
నీ కాళ్ళ గజ్జియలు ఘల్లని మ్రోగ రావేరా                || మోహనాంగా ||

చరణం :-1 
మురళీ ఊదుచు ముద్దుల కృష్ణా రావేరా
నీ కాటుక కన్నులలో మెరయు తళుకు మురిపించెరా
 || మోహనాంగా ||

చరణం :-2
గోవర్ధన గిరి నెత్తిన కృష్ణా రావేరా
నీ కమ్మని పాటలతో , రాగములతో రావేలరా           || మోహనాంగా ||

చరణం :-3
యశోద తనయాయాదవ కృష్ణా రావేరా
నీ కోమల పదములను ,భజిం చెదము రావేలా        || మోహనాంగా |

విన్నానులే వరస :: ఆది తాళం                                      శ్రీ కృష్ణుని పాట

చరణం :- 1       విన్నానులే , విన్నానులే
నీ మహేంద్ర జాలము , కన్నానులే , కన్నానులే
ఇంటికి మింటికి , జంట లేక
నావంటి దీనుల , పంటల ప్రభువని           

 చరణం :- 2      విన్నానులే , విన్నానులే
నీదాసుల సేవ , చేసేనులే , చేసేనులే
దీక్షతో ద్రౌపది, తలంచి నంతలో
అక్షయ వలువలు, ఒసగిన ప్రభువని

 చరణం :- 3      విన్నానులే , విన్నానులే
నీ దాసుల చేరి వేడేనులే, వేడేనులే
పిడికెడు అటుకులు, మెసవి కుచేలుని
అడుగని సిరులిచ్చి, బ్రోచిన ప్రభువని

 చరణం :- 4      విన్నానులే, విన్నానులే
నీ దాసుల పంచలో, ఉన్నానులే, ఉన్నానులే
అంచితమగు, నా సంచిత కర్మల
చించి చించి, రక్షించెడి ప్రభువని

 చరణం :- 5      విన్నానులే, విన్నానులే
నీ నామమె గతి యని, పాడేనులే, పాడేనులే
శ్రీ వేంకట గురువర, కరుణను బడసిన
లక్ష్మయాఖ్యుని, ఏలిన ప్రభువని

                    ______వరస :: ఆది తాళం                  శ్రీ కృష్ణుని పాట



పల్లవి :–
భజమన గోవిందా , భజమన గోపాలా
దయానిధే హరి , కృపా నిధే హరి
జయ జయ జయ జయ రమా పతే                                              || భజమన ||
చరణం :-1 
భజమన శ్యామ బన్సీ లాలా
భజమన ప్యారే , మోహన శ్యామ
మోహన వేష మంజుల భాష
జయ జయ జయ జయ రమా పతే                                              || భజమన ||
చరణం :-2
భజ మన శ్యామ , నంద నా నంద
భజ మన ప్యారే , మేఘ శ్యామ
జనార్ధ హరి , సదా నందా హరి
జయ జయ జయ జయ రమా పతే                                              || భజమన ||
చరణం :-3
భజ మన శ్యామ , యశోద బాల
భజ మన ప్యారే , రాధే శ్యామ
దయానిధే హరి , కృపా నిధే
జయ జయ జయ జయ రమా పతే                                              || భజమన ||
లాహిరి లాహిరి లాహిరిలో వరస :: ఆది తాళం           శ్రీ రంగని పాట

పల్లవి
పండరి పురమున శ్రీరంగా. .
పలుకవు ఏలా రంగా ..
శ్రీ రంగా రంగా ..... ... ... ... ...
|| పండరి పురమున ||
చరణం :-1 
అల వైకుంఠము నీ వే నంటా
అయోధ్య వాసివి నీ వంటా
మనువులు తనువులు , నీ వే నంటా
మాధవ నిన్నే రమ్మంటా ...                                 || పండరి పురమున ||

చరణం :-2
పురాణ పురుషుడు నీ వే నంటా
ప్రకృతీ పురుషుడు  నీ వంటా
ముల్లోకమ్ములు , నీ వే నంటా
ముర హర శ్రీ హర రమ్మంటా ...                || పండరి పురమున ||

చరణం :-3
భక్తుల నెల్ల బ్రోచెద వంటా
భవ భయ హరుడవు నీ వంటా
ముక్తిని ఇచ్చే అభయ హస్తమట
మోక్షము ఇవ్వగ రమ్మంటా ...                  || పండరి పురమున ||

fgldfgdifgoodfigddfgdfgdfdfmmcmkdfkవరస :: ఆది తాళం                                                శ్రీ రంగని పాట




పల్లవి
పాండు రంగ నామం, పరమ పుణ్య ధామం
అదే మోక్ష తీరం, వేద సారం, మధురం, మధురం
|| పాండు రంగ ||
చరణం :-1 
ఎంత పాడు కున్నా, అంతు లేని కావ్యం
ఎన్ని మార్లు విన్నా, నవ్యాతి నవ్యం
|| పాండు రంగ ||
చరణం :-2
పాండు రంగ సన్నిధీ, మరపు రాని పెన్నిధీ
ప్రభుని కరుణ లేనిదీ, జగతి నే మున్నదీ
|| పాండు రంగ ||

చరణం :-3
దాసులైన వారికీ, దాసుడీ తుకారం
ధన్య జీవు లారా, అందుకోండి రాం రాం


పాండు రంగ హరి  జై జై , రామ కృష్ణ హరి జై జై
పాండు రంగ హరి  జై జై , రామ కృష్ణ హరి జై జై

శ్రీ నారాయణుని పాట



చరణం :- 1      
నారాయణ అనరా.. ఈ ఒక్క సారి, నారాయణ అనరా..
ఇంకొక్క సారి , నారాయణ అనరా.. మరొక్క సారి, నారాయణ అనరా..
నారాయణ అన నరకము తొలగును, నారాయణ అనరా

చరణం :- 2      
కేశవ అనరాదా..  ఈ ఒక్క సారి,  కేశవ అనరాదా..  
ఇంకొక్క సారి , కేశవ అనరాదా..   మరొక్క సారి, కేశవ అనరాదా 
కేశవ అంటే , ఆశలు తొలగును, కేశవ అనరాదా  
చరణం :- 3 
మాధవ అనరాదా.. ఈ ఒక్క సారి, మాధవ అనరాదా..
ఇంకొక్క సారి , మాధవ అనరాదా.. మరొక్క సారి, మాధవ అనరాదా..
మాధవ అంటే , మమతలు తొలగును, మాధవ అనరాదా
 చరణం :- 4
శివ శివ అనరాదా.. ఈ ఒక్క సారి, శివ శివ అనరాదా..
ఇంకొక్క సారి , శివ శివ అనరాదా.. మరొక్క సారి, శివ శివ అనరాదా..
శివ శివ అంటే , చింతలు తొలగును, శివ శివ అనరాదా
 చరణం :- 5
రామా అనరాదా.. ఈ ఒక్క సారి, రామా అనరాదా..
ఇంకొక్క సారి , రామా అనరాదా..  మరొక్క సారి, రామా అనరాదా..
రామా అంటే, రాగము తొలగును, రామా అనరాదా

చరణం :- 6
శంకర అనరాదా.. ఈ ఒక్క సారి, శంకర అనరాదా..
ఇంకొక్క సారి , శంకర అనరాదా..  మరొక్క సారి, శంకర అనరాదా..
శంకర అంటే , శంకలు తొలగును, శంకర అనరాదా
 చరణం :- 7
కృష్ణా అనరాదా.. ఈ ఒక్క సారి, కృష్ణా అనరాదా..
ఇంకొక్క సారి , కృష్ణా అనరాదా..  మరొక్క సారి, కృష్ణా అనరాదా..
కృష్ణా అంటే , కష్టము తొలగును, కృష్ణా అనరాదా..
చరణం :- 8 
గోవింద అనరాదా.. ఈ ఒక్క సారి, గోవింద అనరాదా..
ఇంకొక్క సారి , గోవింద అనరాదా..  మరొక్క సారి, గోవింద అనరాదా..
గోవింద అంటే , కోపము తొలగును, గోవింద అనరాదా..
  


శ్రీ హరి పాట


చరణం :- 1                  హరి బోల్ హరి బోల్, హరి హరి బోల్
ముకుంద మాధవ, గోవింద బోల్

చరణం :- 2                  రామ బోల్ రామ బోల్, రామ రామ బోల్
సీతా సమేత, శ్రీ రామ చంద్ర బోల్

చరణం :- 3                  కృష్ణ బోల్ కృష్ణ బోల్, కృష్ణ కృష్ణ బోల్
రాధా సమేత, శ్రీ రాధా కృష్ణ బోల్

చరణం :- 4                  విఠల్ బోల్ విఠల్ బోల్, విఠల్విఠల్ బోల్
రుక్మా సమేత, శ్రీ పాండు రంగ బోల్ 

చరణం :- 5                  శివ బోల్ శివ బోల్, శివ శివ బోల్       
గౌరీ సమేత, శ్రీ సాంబ శివ బోల్ 

చరణం :- 6                  విష్ణు బోల్ విష్ణు బోల్, విష్ణు విష్ణు బోల్
లక్ష్మీ సమేత, శ్రీ లక్ష్మీ నాధ బోల్

చరణం :- 7                  బోల్ బోల్, బోల్ బోల్, బోల్ బోల్ బోల్
వల్లీ సమేత, శ్రీ సుబ్రహ్మణ్య బోల్

:: ఆది తాళం                                      శ్రీ అయ్యప్ప స్వామి పాట

పల్లవి –           స్వామీ శరణం, శరణమొ అయ్యప్పా
హరి హర సుత ఓ పావన చరితా
భక్త మందారా భవ పరి హార
కరుణతో మమ్ము కావుము అయ్యప్పా                 || స్వామి శరణం ||
చరణం :-1        ముడుపులు కట్టి, శిరమున దాల్చి , మ్రొక్కులు తీర్చెద మయ్యా ,
నీవే దిక్కని వేడెద మయ్యా
దర్శన మొంద, ధన్యత పొంది, తరలీ వచ్చెద మయ్యప్పా
అయ్యప్పా స్వామీ, అయ్యప్పా                             || అయ్యప్పా ||
చరణం :-2        అళుదా నదిలో మునిగి, రెండు రాళ్ళను చేతితొ తీసి
నిండు భక్తి తొ గుట్ట ఫై నుంచి 
కరిమల చేరి, కరములు మోడ్చి, ఆనంద ముప్పొంగ పాడుదాం 
అయ్యప్పా స్వామి  అయ్యప్పా                        || అయ్యప్పా ||
చరణం :-3        పంబను చేరి ఆశలు మీరి, భక్తి తొ నిన్ను తలసీ
నదిపై జ్యోతులనే వెలిగించి
శబరి పీఠం చూసి, శరముల గుచ్చి, నీ కీర్తి వెలుగెత్తి సాటు
అయ్యప్పా స్వామి  అయ్యప్పా                        || అయ్యప్పా ||
చరణం :- 4       ప్రతి ఏడాది మకర సంక్రాంతి కి, పావన సన్నిధి చేరి
నీదు దర్శన భాగ్యము కోరి
పదునెనిమిది మెట్లెక్కి , పదములు మ్రొక్కి, పరవశ మవుదుము స్వామీ
అయ్యప్పా స్వామి  అయ్యప్పా                             || అయ్యప్పా ||

బృందావనమది అందరిది వరస:: ఆది తాళం                   మంగళ హారతి పాట
పల్లవి
మంగళ హారతి, ముదముగను
మా సీతా రాముల కివ్వరటే
సుదతు లార మీరందరు కూడి
సొంపుగ హారతు లీయరాటే                                               || మంగళ ||
చరణం :-1 
                      బంగరు పళ్ళెరముల యందు
బల్ చక్కని వసంత మును బోసి
వనిత లార మీ రందరు కూడి
వేగమె హారతు లీయరటే                                        || మంగళ ||     
చరణం :-2       
సీతా రాముని పొగడుచును
బహు చక్కని పాటలు పాడుచును
రమణు లార, మీ రెల్లరు కూడి
రయముగ హారతు లీయరటే                                    || మంగళ ||
చరణం :-3       
పునుగు జవ్వాది, అత్తరులు
బల్ చక్కని పన్నీరుల తోడ
సుగంధి తిలకము, దిద్దుచు మీరలు
యింపుగ హారతు లీయరటే                                              || మంగళ ||