పల్లవి :–
మహేశా పాప వినాశా , కైలాస వాసా ఈశా
చరణం :-1
భక్తి యే దొ పూజ లేవో , తెలియ నైతినే
పాపమేదో పుణ్యమేదో , కాననైతినే దేవా || మహేశా ||
చరణం :-2
మంత్ర యుక్త పూజ చేయ.. , మనసు కరుగునా ....
మంత్రమో.. తంత్రమో.. , యెరుగ నైతినే ....
నాద మేదొ వేద మేదో, తెలియనైతినే ..
వాదమేల పేద బాధా... , తీర్చ రావయా .. స్వామీ... || మహేశా ||
చరణం :-3
ఏక చిత్తమున నమ్మిన వారికి
శోకము తీర్తువో రుద్రయ్యా
ప్రాకటముగ, చిరు వేట జూపి -
- నా ఆకలి దీర్చగ రావయ్యా
ధీటుగ నమ్మితి గనవయ్యా
వేట జూపుమా రుద్రయ్యా
No comments:
Post a Comment