పల్లవి –
ఓ ఓ ఓ ఓ, ఓ ఓ ఓ ఓ కైలాస హిమగిరి
శంకరా... ,
అను పల్లవి :--
కనికరా.. ముంచరా...
కరుణించి మోము చూపించరా.. || ఓ ఓ ఓ ||
చరణం :-1
చంద్ర మౌళీ, శ్రిత పద్మ శాలి
చంద్ర కిరణాల , తేజో (ప్రభో )విహారి
దండ మోయీ, ఓ లింగ ధారి
శరణు శరణూ శరణంటి నిన్నే || కనికరా.. ||
చరణం :-2
గంగనూ శిరమూ, దాల్చె దేవర
ముందుగా నన్ను, బ్రోవగ రాదా
అందమైన , ఓ శంభు లింగా
శరణు శరణూ శరణంటి నిన్నే || కనికరా.. ||
చరణం :-3
నీల కంఠా, శేషా భూషణ
ఆశ్రిత భక్తుల, బ్రోచే వాడా
భక్త సులభుడ, నను బ్రోవ వేగా
శరణు శరణూ శరణంటి నిన్నే || కనికరా.. ||
శరణు శరణూ శరణంటి నిన్నే || కనికరా.. ||
No comments:
Post a Comment