పల్లవి - నమో ఆంజనేయా, జయ జయ నమో రామదూతా...
ప్రభో , నమో ఆంజనేయా, జయ జయ నమో రామదూతా...
జయ జయ నమో రామదూతా... ||నమోఆంజనేయా||
చరణం :-1 రామ రామ యని రయమున పాడుచు
రామ స్మరణము, చేసెడి వారికి
రామ లక్ష్మణుల, భారము నాదని
చరణం :-2 పండ్లు ఫలంబులు పనస తొనలను
సీతా రాముల, భుజియింపగను
కన్నబిడ్డ వలె, కనికరించుచు
కన్నుల పండుగ , గాంచిన దేవా ... ||నమోఆంజనేయా||
చరణం :-3 భక్తుల నెల్లను , బ్రోచే వాడా
ముక్తి సంపదల, నొసగే వాడా
ఆంజనేయుడవు, నీవే కావా
ఓ రామ భక్తా, శ్రీ ఆంజనేయా ... ||నమోఆంజనేయా||
చరణం :- 4 రామ లక్ష్మణుల , నిరతము గాంచిన
వానర మూర్తివి , నీవే కావా
ఎల్లప్పుడు , నీ నామమె గతియని
స్మరించి , భజించి , తరింతు దేవా ... ||నమోఆంజనేయా||
స్మరించి , భజించి , తరింతు దేవా ... ||నమోఆంజనేయా||
No comments:
Post a Comment