About Me

My photo
Juvvalapalem, Andhra Pradesh, India
ఇది జంపన వారి కళా తృష్ణకి నిలువెత్తు నిదర్శనం. తెరలు తెరలుగా పైకెగసే భక్తి భావానికి సంపుటి రూపం మా ఈ ప్రయత్నం. గౌరవనీయులు శ్రీయుతులు జంపన సత్యనారాయణ రాజు గారు మరియు వారి సహధర్మచారిణి అయినటువంటి శ్రీ వరలక్ష్మి గార్ల స్వహస్తాలతో పొందుపరచబడిన రాగాల మాలిక. వారి ఇంట వెలసిన దేవతా మూర్తుల గానామృత చరిత్రకి మంచి మనసులు తోడై రచించిన కరపత్ర దీపిక.

Wednesday, 17 April 2013

శివ కేశవులకు


------------- రాగం  :: ఆది తాళం                                శ్రీ శివ కేశవుల పాట
                    


పల్లవి :–
శివ కేశవులకు, బేధమా
సుజ్ఞాన వంతులకు భారమా                                      || శివ కేశవు ||

 చరణం :-1 
ప్రేమ బూడిద రాసె లింగడూ
పట్టూ నామాల్ పెట్టే రంగడూ
ప్రేమ బూడిద లింగ, పట్టూ నామాల్ రంగ
వారిద్దరొకటేను, వాదాపు జనులార                              || శివ కేశవు ||
                  
                 
చరణం :-2
పులి చర్మం కట్టే లింగడూ
పట్టూ నామాల్ పెట్టే రంగడూ
పులీ చర్మం లింగ ,పట్టూ నామాల్ రంగ
వారిద్దరొకటేను, వాదాపు జనులార                             || శివ కేశవు ||

చరణం :-3
ఎద్దు నెక్కిన వాడు.. లింగడు
గద్ద నెక్కిన వాడు రంగడు
ఎద్దు నెక్కిన లింగ, గద్ద నెక్కిన రంగ
వారిద్దరొకటేను, వాదాపు జనులార                              || శివ కేశవు ||

lord-rama-prayers.jpg
చరణం :-4   
ఘంట శంఖము పట్టె లింగడు
శంఖు, చక్రము పట్టె రంగడు
ఘంట శంఖము లింగ ,శంఖు చక్రము రంగ
lord-rama-prayers.jpgవారిద్దరొకటేను, వాదాపు జనులార                             || శివ కేశవు || 


చరణం :-5
పాము పాగా చుట్టే లింగడు
పాము ఫై పవ్వ ళించే రంగడు
పాము పాగ లింగ, పవ్వ ళించే రంగ
వారిద్దరొకటేను, వాదాపు జనులార                              || శివ కేశవు ||

చరణం :-6
కైలాస గిరి యందు లింగడు
వైకుంఠ పురమందు రంగడు
కైలాస గిరి లింగ, వైకుంఠ పుర రంగ 
వారిద్దరొకటేను, వాదాపు జనులార                             || శివ కేశవు ||

2 comments:

  1. Very Nice ... give ur phone number this is jampana varma

    ReplyDelete
  2. బహు చక్కని భావన.. 🙏

    ReplyDelete