శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు ఓం నమో విఘ్నేశ్వరాయ నమః
పల్లవి - శ్రీ గణేశ్వర, గిరిజా కుమారా..
సుగుణ సంపన్న, సాకారా...
మంచి కుడుములు, ఉండ్రాళ్ళు నీ ..కు ..
ఉంచి నానయ్య , రా ..వే.. రా.. ||శ్రీ గణేశ్వర||
చరణం :-1 పూర్వము నీ పుణ్య ఫలమేమొగాని
పార్వతి ప్రియ పుత్రుడైనావు జ్ఞాని
పర్వత సంచారా.., సర్వము నీవేరా..
ప్రార్ధన చేసేమురా ... ఆ ఆ ఆ ... ||శ్రీ గణేశ్వర||
చరణం :-2 ఏ పని నే జేసినను నిన్ను ముందు
నీ పద పద్మాలు స్మరియించు చుందు
తాపస మందార.., తండ్రివి నీవేరా..
తనయుని కాపాడరా ... ఆ ఆ ఆ ... ||శ్రీ గణేశ్వర||
చరణం :-3 శ్రీకర శ్రీకృష్ణ భగవానుడై..నా..
నిందలు మోసేడు నీ కారణా..నా..
నీ కృప లేకున్న.., ఈ ధర ఎవరైనా..
కార్యములను జేయునా ... ఆ ఆ ఆ ... ||శ్రీ గణేశ్వర||
చరణం :- 4 ఏలిక నీ వాహనం ఎలుక రాజా
బాలుడు భక్తుండు ఈ నూకరాజూ ..
జాలము నీకేల .., జాలితొ రావేరా..
మాలను గై కొనరా ... ఆ ఆ ఆ ... ||శ్రీ గణేశ్వర||
No comments:
Post a Comment