పల్లవి :–
దేవ దేవ ధవళాచల మందిర
గంగాధర హర నమో నమో
దైవతలోక , సుధాకర హిమకర
లోక శుభంకర , నమో నమో ||దేవ దేవ ||
చరణం :-1
పాలిత కింకర , భవనా శంకర
శంకర పుర హర నమో నమో
హాలా హాల ధర , శులాయుగ కర
శైల సుతా వర , నమో నమో ||దేవ దేవ ||
చరణం :-2
దురిత విలోచన , పాల విలోచన
పరమ దయాకర , నమో నమో
కరి చర్మాంభర, చంద్ర కళా ధర
సాంబ దిగంబర, నమో నమో ||దేవ దేవ ||
No comments:
Post a Comment