పల్లవి :–
శివ కేశవులకు, బేధమా
సుజ్ఞాన వంతులకు భారమా ||
శివ కేశవు ||
చరణం :-1
ప్రేమ బూడిద రాసె లింగడూ
పట్టూ నామాల్ పెట్టే రంగడూ
ప్రేమ బూడిద లింగ, పట్టూ నామాల్ రంగ
వారిద్దరొకటేను, వాదాపు జనులార || శివ కేశవు ||
చరణం :-2
పులి చర్మం కట్టే లింగడూ
పట్టూ నామాల్ పెట్టే రంగడూ
పులీ చర్మం లింగ ,పట్టూ నామాల్ రంగ
వారిద్దరొకటేను, వాదాపు జనులార || శివ కేశవు ||
ఎద్దు నెక్కిన వాడు.. లింగడు
గద్ద నెక్కిన వాడు రంగడు
ఎద్దు నెక్కిన లింగ, గద్ద నెక్కిన రంగ
వారిద్దరొకటేను, వాదాపు జనులార || శివ కేశవు ||
చరణం :-4
ఘంట శంఖము పట్టె లింగడు
శంఖు, చక్రము పట్టె రంగడు
ఘంట శంఖము లింగ ,శంఖు చక్రము రంగ
వారిద్దరొకటేను, వాదాపు జనులార || శివ కేశవు ||
చరణం :-5
పాము పాగా చుట్టే లింగడు
పాము ఫై పవ్వ ళించే రంగడు
పాము పాగ లింగ, పవ్వ ళించే రంగ
వారిద్దరొకటేను, వాదాపు జనులార || శివ కేశవు ||
చరణం :-6
కైలాస గిరి యందు లింగడు
వైకుంఠ పురమందు రంగడు
కైలాస గిరి లింగ, వైకుంఠ పుర రంగ
వారిద్దరొకటేను, వాదాపు జనులార || శివ కేశవు ||