About Me

My photo
Juvvalapalem, Andhra Pradesh, India
ఇది జంపన వారి కళా తృష్ణకి నిలువెత్తు నిదర్శనం. తెరలు తెరలుగా పైకెగసే భక్తి భావానికి సంపుటి రూపం మా ఈ ప్రయత్నం. గౌరవనీయులు శ్రీయుతులు జంపన సత్యనారాయణ రాజు గారు మరియు వారి సహధర్మచారిణి అయినటువంటి శ్రీ వరలక్ష్మి గార్ల స్వహస్తాలతో పొందుపరచబడిన రాగాల మాలిక. వారి ఇంట వెలసిన దేవతా మూర్తుల గానామృత చరిత్రకి మంచి మనసులు తోడై రచించిన కరపత్ర దీపిక.

Thursday, 26 May 2011

భజన గీతాలు (Vol-I)

మా మాతృమూర్తి అయిన శ్రీ వరలక్ష్మి గారి స్వహస్తాలతో విరచింపబడిన గానామృత భక్తి గీతాలు 
అనదగు భజనలను "భజన గీతాలు" గా ప్రత్యేకంగా పొందుపరచాను. చదివి తరించ ప్రార్ధన. రచించినవాటిలో అవి కొన్ని మాత్రమే.

మిగిలినవి వీలైనంత త్వరలో పొందుపరచగలనని భావిస్తున్నాను. దైనందిన జీవనంలో కొట్టుమిట్టాడు పురజనులకు ఈ మాలిక ఒక మోక్ష ప్రదాయనిగా ఉపయోగపడగలదని మనస్పూర్తిగా ఆకాంక్షిస్తున్నాను.
****************************************************************************